*ఇష్టం-కష్టం-నష్టం (రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ)

ప్రశ్నల బ్రతుకంటే ఇష్టం

మలుపుల జీవితమంటే మరీఇష్టం

స్నేహం పెంచుకోవాలని మరీ మరీ ఇష్టం

వర్ధమానున్ని, తెలుగుని, బ్రతికించాలని మరీ ఇష్టం

మార్పు తేవాలంటే ఎంతో కష్టం

ఒకరిని తృప్తి పరచాలంటే మరీ కష్టం

ధర్మంగా బ్రతకాలంటే మరీ మరీ కష్టం

ఇష్టం గా మార్చుకొని చేసిన మెప్పించటం కష్టం

జీవితమ్ మహోన్నతమైనది చేయకు నష్టం

కాలాన్ని వ్యర్ధం చేసి బ్రతుకుట మరీ నష్టం

ఆత్మా విశ్వాసం వదలి ప్రవర్తించుట మరీ మరీ నష్టం

అరుణోదయ కాంతి ధర్మాన్ని గ్రహించలేకపవటం మరీనష్టం

 –((*))–