ఈ నాడు స్పెషల్ – శ్రావణ పౌర్ణమి విశిష్టత!

ఓంశ్రీరాం – శ్రీ మాత్రేనమ: – సర్వేజనాసుఖినోభావంతు

(ఆనందం – ఆరోగ్యం – ఆధ్యాత్మికం – ప్రాంజలి ప్రభ లక్ష్యం )

సేకరణ, రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  పాట: బోనలు

సినిమా: ఇస్మార్ట్ శంకర్

దర్శకుడు: పూరి జగన్నాధ్

నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్ & నభా నటేష్

గాయకుడు: రాహుల్ సిప్లిగుంజ్ & మోహనా భోగరాజు

సాహిత్యం: కసర్ల శ్యామ్

సంగీతం: మణి శర్మ

***

ప్రాంజలి ప్రభ – ఈ నాటి సినిమా సంగీతమ్

నీ ముక్కు పోగు మెరుపూ లోనా

పోద్దూ పోడిసే  తూరుపులోన

మైసమ్మా 


యర్రా యర్రాని సూరీడు 


నీ నుదుటానా బొట్టాయే

ఓ సల్లని సూపుల తల్లి

మాయమ్మా 


అమ్మలగన్న అమ్మరన్న

పచ్చి పసుపు బొమ్మరన్న

యాప చెట్టు కొమ్మరన్న

ధూపమేసే  ధుమ్మురన్న


ఆషాడ మాసమన్న

అందులో ఆధీవారమన్న

కొత్తా  కుండల బోనమన్న

నేత్తి కెత్తేను పట్నమన్న


యో సే యో

నే బోనలు రే

చల్లో చల్లో

గండి మైసమ్మారో


యో సే యో

నే బోనలు రే

చల్లో చల్లో

గండి మైసమ్మారో


హే రాయ్ రాయే

హే రాయ్ రాయే

ఆరే రాయే రాయే

ఆరే రాయే రాయే

మసమ్మా 


బల్కంపెట్ యెల్లమ్మవే

మా తల్లి బంగారు మైసమ్మవే

ఉజ్జయిని మహంకాళివే మా యమ్మ

ఊరురా పోచమ్మవే


యో సే యో

నే బోనలు రే

చల్లో చల్లో

గండి  మైసమ్మారో


యో సే యో

నే బోనలు రే

చల్లో చల్లో

గండి  మైసమ్మారో


ఆరే రేవుల పుట్టింధమ్మ

రేణుక యెల్లమ్మ

జెర్రిపోతులా తీసీ జడాల చుట్టింధి

నాగు పాముల తీసీ నడుమున కట్టింధి

యదుగురు అక్కా చెల్లెల్లు యెంటా రంగా

యెదేడు లోకలు ఎలుతున్నదమ్మ

మావురల యెల్లమ్మ

ధండాల్  తల్లి


ఇది బార్క్ బార్క్ బర్కత్ పురా

Dj ఇస్మార్ట్ డిస్ డిస్కో బోనల్


పేయీ నిండా గవ్వల్ని పెర్సుక్కున్నవే

వెయీ కండ్ల తల్లి

నికు యాటా పోతులే

నిమ్మకాయ ధండల్లో

నిండుగున్నావే 

కల్లు కుండ తెచ్చి

ఇంటా సాకా పోస్టుమే


ఆరే చింతా పూలా

చీర కట్టినావే

చేత శూలం

కత్తి పట్టినవే

మోతం దునియానే

ఏలుతున్నావే 


హే .. రాయే రాయే తల్లి

హే .. రాయే రాయే

ఆరే .. రాయే రాయే

ఆరే .. రాయే రాయే

మైసమ్మా 


జూబ్లీ హిల్స్ పెద్దమ్మవే మాయమ్మ

జగమేలే మా తల్లివే

గోల్కొండ యెల్లమ్మవే మాయమ్మ

లష్కర్ కే నువ్ రా ణి వే


యో సే యో

హే పోథా రాజురో

ఆరే జజ్జనకర జజ్జనకర

టీన్ మారురో


యో సే యో

నే బోనలు రే

చల్లో చల్లో

గాండి మైసమ్మారో


యెస్కో మామా తీన్ మార్


అగ్గి గుండలల్లో నువ్వ బాగ్గుమన్నవే

సుత్తు ముత్తు సుక్కల్లో ముద్దుగున్నవే

పుట్టలోనా ఉన్నట్టి మట్టి రూపమే

బాయిలోనా పుట్టి అల్లినావు బంధమే


హే గాలీ ధూలీ అంతా నువ్వేలీ

జాలి గల్లా తల్లి నువ్వేలే 

ఈ  జనమంత నీ బిడ్డలే


హే .. రాయే రాయే

హే .. రాయే రాయే

ఆరే .. రాయే రాయే

ఆరే .. రాయే రాయే

మైసమ్మా 


బెజవాడ దుర్గమ్మావే మా తల్లి

కలకత్తా మహాంకాలివే

కంచినున్న కామాక్షివే మాయమ్మ

మధురో లోనా మీనాక్షివే


యో సే యో

ఆరే ఎరాగోలా రో

ఆరే టోటెల్లాతో పోట్టెల్లా

బండి కడిలెరో


యో సే యో

నే బోనలు రే

చల్లో చల్లో

గండి మైసమ్మారో


ఇది హమారా కిరాక్ బోనల్ బోనల్ బోనల్

–((***))-

–((***))–


 ఒక ఊరిలో ఒక వర్తకుడు వుండేవాడు. 

ఒక రోజున సత్సంగంలో–


‘ ప్రాణము పోయే సమయంలో భగవత్ చింతన చేస్తే మోక్షం కలుగుతుంది’ అని చెప్పడం విని ఇలా ఆలోచించాడు.


” నా నలుగురి కుమారులకు దేవుని పేర్లు పెట్టుకుని వారిని పిలిచే అలవాటు చేసుకుంటాను. నాకు అంతిమ ఘడియలు వచ్చినపుడు నా కుమారులను ఎలాగూ పిలుస్తాను కదా! ఆ విధంగా నాకు సులభంగా ముక్తి లభిస్తుంది.”


కాలం గడుస్తూ వున్నది. కుమారు లందరూ పెద్దవారై తండ్రి చేస్తూన్న వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసారు. వర్తకునికి అంత్యకాలము ఆసన్నమైనది. ఇంక కొన్ని క్షణాల్లో ప్రాణము పోతుందని వర్తకుడు గ్రహించి వెంటనే ‘ ఒరేయ్ రామా!, ఒరేయ్ కృష్ణా!, నాయనా గోవిందా!, నాయనా మాధవా! ‘ అని అందరిని పేరుపేరునా పిలవసాగాడు.


విషయం తెలిసి కుమారులందరూ తండ్రి వద్దకు వడి వడిగా చేరుకు న్నారు. నల్గురూ ఒక్కసారిగా 

“నాన్నగారూ! ఎందుకు పిలిచారు? మీకెలా వున్నది?” అనడిగారు నలుగురినీ తేరిపార చూసు కున్నాడు అ వర్తకుడు. అతడికి అకస్మాత్తుగా తన దుకాణం గుర్తుకు వచ్చినది. కుమారులను  చూసి చిరాకు పడుతూ ” పిలిస్తే మాత్రం మీరంతా కట్టకట్టుకుని వచ్చేయడమేనా? అక్కడ మన అంగడి ఏమైపోతుంది? ” అని వ్యధ పడుతూ మరణించాడు. ఆఖరి క్షణంలో అతడి ధ్యాసంతా దుకాణం మీదకు పోయింది.


జీవితకాలమంతా దైవనామ స్మరణ చేయుట వలన, అభ్యాసము వలన అంత్యక్షణాల్లో భగవన్నామము పలుకగలమే గాని బలవంతముగా యుక్తులతో భగవన్నామము పలుకగలమని ఆనుకోవడం అవివేకము. మన  శరీరము, మనస్సు,ఇంద్రియములు, బుద్ధి బాగా వున్నప్పుడే దైవచింతన  చేయుట అలవాటు చేసుకోవాలి.


అందుకే ఆది శంకరాచార్యుల వారు తమ భజగోవిందం లో ఇలా అంటారు…


*భజగోవిందం* *భజగోవిందం*

*గోవిందం భజమూఢమతే |* 

*సంప్రాప్తే సన్నిహితే కాలే* 

*నహి నహి రక్షతి* *డుకృఞ్కరణే* ||


తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.

ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

–((***))–

శ్రావణ పౌర్ణమి విశిష్టత!
.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||

పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారికి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి.

.
అన్నా చెల్లి అనుబంధం.రాఖి!

భారతీయ పురాణాలని అనుసరించి మృత్యు కారకుడైన యమధర్మరాజు ముంజేతికి ఆయన సోదరి యమున రాఖీ కట్టి, ఆయనని అమరుడిగా భాసిల్లమని ఆశీర్వదించడంతో ‘రక్షాబంధన’ సంప్రదా యం ఆరంభమైందని ప్రతీతి.
.
శిశుపాలిడి మరణానంతరం, శ్రీకృష్ణుడిని గాయపడిన చేతి వేలితో చూసిన ద్రౌపది తట్టుకోలేక, తన చీరె కొంగును చించి ఆయన ముంజేతికి కట్టుగా కట్టిందట.
ఆమె ప్రేమతో కరిగిపోయిన శ్రీకృష్ణుడు రాబోయే 25 సంవత్సరాల కాలంలోనే, ఆమె చేసిన సేవకి ప్రత్యుపకారం చేసి తీరుతానని మాట ఇచ్చాడట.
కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, అసహాయ శూరులైన ఐదుగురు భర్తల సమక్షంలో, అక్షయ వస్త్ర ప్రదానం చేసి, ఆమె మాన సంరక్షణకి పూనుకున్న వాడు, ఆమె అపూర్వ సహోదరుడు శ్రీకృష్ణుడే.

రాఖీ పేరు చెబితే నాకు చిన్నప్పుడు చదివిన కధ గుర్తుకొస్తుంది. గ్రీకువీరుడు అలెగ్జాండర్ గురువు ప్రోదల్బంతో ప్రపంచ విజేత కావాలని బయల్దేరుతాడు. అతన్ని గాఢంగా ప్రేమించిన రుక్సానా కూడా సైనికుడి వేషంలో అతన్ని వెన్నంటి ఉంటుంది.

 దారిలో దేశాలను పాదాక్రాంతులను చేసుకొంటూ వస్తున్న అలెగ్జాండర్ భారతదేశాన్ని సంపన్నదేశంగా విని ఉండటంతో తన సైన్యాన్ని అటువైపు నడిపాడు. అవి క్రీస్తుపూర్వం రోజులు. భారత భూభాగం సమర్ధులైన రాజుల పాలనలో అనేక రాజ్యాలుగా విడిపోయి ఉంది. 

అప్పట్లో కాశ్మీర ప్రాంతాన్ని పురుషోత్తముడు పాలించేవాడు. ఆ రాజ్యాన్ని ఆనుకొని ఉన్న తక్షశిలను అంభి అనే అసమర్ధుడైన రాజు పాలించేవాడు. అతడు పురుషోత్తముడిని పాదాక్రాంతుణ్ణి చేసుకొని ఆ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనే దుర్బుద్ధితో అలగ్జాండరుని కలిసి పురుషోత్తముని అట్టుగుట్టులను తెలపటమే గాక తన సైన్యంతో అతనికి సాయపడ్డాడు(అలా అంభి విదేశీయులు యీ గడ్డపై అడుగుపెట్టడానికి మూలమైన తొలి విద్రోహి అయ్యాడు). యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఎన్ని కుత్సితాలు చేసినా అల్గ్జాండర్ కి ఓటమి తప్పేలా లేదు.

 ఇంతలో రాఖీ పండుగ వచ్చింది. పురుషోత్తముని శక్తిసామర్ధ్యాలే గాక అతని నీతివర్తన గురించి విన్న రుక్సానా రాఖీ తీసుకొని రాత్రివేళ పురుషోత్తముని గుడారానికి వెళ్ళింది. అతనికి రాఖీ కట్టి, తన వివరాలను, కోరికను బయటపెట్టింది. కొన్ని నైతిక విలువలకు కట్టుబడిన రాజైన పురుషోత్తముడు శత్రు గుడారాలనుంచి తన గుడారానికి వచ్చిన రుక్సానాను బంధించక క్షేమంగా ఆమె గుడారానికి పంపటమే గాక రాఖీ సూత్రప్రకారం చేస్తానని ఆమెకు మాట యిచ్చాడు. 

మరునాడు ద్వంద్వయుద్ధంలో గుర్రం మీదనుంచి క్రింద పడిపోయిన అలెగ్జాండరు పైకి దూకి చంపటానికి పురుషోత్తముడు కత్తి గాలిలోకి పైకి లేపాడు.ాతని కత్తిపట్టిన చేతికి రుక్సానా కట్టిన రాఖీ కనిపించిందతనికి. అప్పుడు క్రిందటిరాత్రి రుక్సానా తన చేతికి రాఖీ కట్టినఫ్ఫుడు అన్నగా తను ఆమెకిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ” ఎట్టి పరిస్థితిలోను అలెగ్జాండర్ నీ చేత చిక్కితే అతన్ని ఏమీ చేయక ప్రాణాలతో విడిచిపెట్టా” లన్న రుక్సానాకు ” తప్పకుండా ” అని మాటిచ్చాడు తను. ఆ వాగ్దానం గుర్తుకొచ్చి అతన్ని విడిచి వెనక్కి తిరిగిన పురుషోత్తముణ్ణి గ్రీకు సేనలు బంధించి, అలెగ్జాండరు నెగ్గినట్లుగా ప్రకటించాయి . మరునాడు సభకు పురుషోత్తముణ్ణి సంకెళ్ళతో తీసుకొచ్చారు. 

అలెగ్జాండరు తన ముందు తల దించక నిలబడ్డ పురుషోత్తముణ్ణి ” మహావీరా! నీ ప్రతాపం నాకు నచ్చింది. నిన్నెలా సత్కరించమంటావ్?” అనడిగాడు. దానికి పురుషోత్తముడు ” నీవు ధర్మనిరతుడవైతే, మహావీరుడనని నన్ను సంబోధించిన నీకు ఒక వీరుణ్ణి ఎలా సత్కరిస్తారో తెలియకపోదు.” అని బదులిచ్చాట్ట. ఆ మాటలకు పొంగిపోయిన అలెగ్జాండరు స్వయంగా సింహాసనం దిగివచ్చి అతని సంకెళ్ళు తొలగించి సింహాసనంపై కూర్చోబెట్టి తిరిగి అతని రాజ్యాన్ని అతనికే యిచ్చేశాడు 

అలెగ్జాండర్. రక్తం పంచుకోకపోయినా, తన గుడారానికి రాత్రిసమయంలో వచ్చి రాఖీ కట్టిన ఒక విదేశీవనిత అభిమానానికి పురుషోత్తముడిచ్చిన అమూల్యకానుక అలెగ్జాండర్ కి అతనిచ్చిన ప్రాణదానం. ఎన్నికలముందు యిచ్చిన వాగ్దానాలను ఎన్నికలయ్యాక మరచిపోయే యీ బీరాల రాజకీయుల కన్న ఆ మహావీరులను ప్రజలిప్పటికీ తలచుకోవటానికి మూలకారణం వారిలో ఉన్న సత్యసంధత, ప్రజారంజకమైన పాలన. ఈ దేశంలో ప్రతిఆలయంలోను భార్యాభర్తల, లేదా ప్రేయసీప్రియుల దేవాలయాలే కనిపిస్తాయి. కానీ ఒరిస్సాలోని ఒక్క పూరీలో మాత్రమే అన్నాచెల్లెళ్ళ దేవాలయం ఉన్నది. కృష్ణ, బలరాముల నడుమ వాళ్ళ భార్యలు కాకుండా చెల్లెలు సుభద్ర ఉండటం ఒక విశేషంగా యీ రాఖీ రోజున చెప్పుకోవటంలో తప్పులేదుగా?

చెల్లెమ్మలందరికి రాఖి పండుగ శుభాసీస్సులు 

మీరెల్లప్పుడు కళకళలాడుతూ 

సంతోషంగా ,ఐశ్వర్యంగా , ఆరోగ్యంగా వుంటూ ,మీవారు మీరు చెప్పినట్టు వింటూ 🙂 

మీ పిల్లలు మీ అడుగుజాడలలో నడుస్తూ 

మీరు నగల షాపుకెళ్ళినా ,బట్టల షాపుకెళ్ళినా మీరు కోరినా డిజైన్లు కోరిన వెలకే , మళ్ళీ అదే డిజైన్ ఇంకొకరికి దొరకకుండా వుండాలనీ 

సంతోషం మీ ఇంటి వాకిలి ముందు నిలుచుని మీరు పిలిచినప్పుడల్లా వచ్చెయ్యాలని 

తరాలు మారినా , యుగాలు మారినా ,శతాబ్దాలు దొర్లినా 

ఎన్నటికి , ఎప్పటికి మారని మార్పురాని ఇప్పుడున్న ఈ అమాయకపు భర్తలే ఎన్ని జన్మలైనా దొరకాలని ఆశిస్తూ 

Bhaiya Mere Rakhi Ke Bandhan Ko [Full Song] Raksha Bandhan

Song – Bhaiya Mere Rakhi Ke Bandhan Ko Album – Raksha Bandhan Singer – Sonu Nigam, Bela Sulekha Musi…

Happy Rakshabandhan….

Pandanti Jeevitham Songs – Anthuleni Anuragam – Vijayashanthi – Sujatha – Sobhan Babu

Watch Sobhan Babu Vijayashanthi Sujatha’s Pandanti Jeevitham Telugu Movie Song With HD Quality Music…

శుభోదయం మిత్రులకు “శ్రావణ పౌర్ణమి” మరియు “రక్షా బంధన్” శుభాకాంక్షలు. https://www.youtube.com/watch?v=EJoWnJHbOG8
Bangaru Chellelu Songs – Annayya Hrudayam – Sobhan Babu, Murali Mohan, Sridevi

Movie: Bangaru Chellelu, Cast: Sobhan Babu, Jayasudha, Murali Mohan, Sridevi, Direction : V Madhusud…


https://www.youtube.com/watch?v=kwbFGGfn8Wc
raksha bandhan telugu songs 2013 http://247etnews.com

http://raksha-bandhan-rakhi.blogspot.in/ raksha bandhan raksha bandhan 2013 date raksha bandhan in 2…

–((***))–


ప్రాంజలి ప్రభ – నేటి  భగవద్గీత

నరకంలో ప్రవేశించటానికి ద్వారాలు 3 ఉన్నాయి. అవే కామం, క్రోధం, లోభం. ఈ 3 దుర్గుణాలు ఉంటే నరకద్వారాలు తెరుచుకుంటాయి. ఈ 3 గుణాలు లేకపోతే నరకద్వారాలు మూసుకుపోతాయి. నిజంగా ఆసురీ గుణాలన్నింటిని ఈ మూడుగా ఇక్కడ విభజించి చెబుతున్నారు. ఈ 3 గుణాల చరిత్ర రామాయణం అంత ఉంటుంది. అయినా ‘రామాయణాన్ని 3 ముక్కలలో చెప్పండి’ అంటే కట్టె – కొట్టె – తెచ్చె అని చెబుతారు మనవాళ్ళు. 


ఆసురీ గుణాలన్నింటికి తలమానికం ఈ 3 గుణాలు. ఈ ముగ్గురు ఆసురీసేనకు సేనానాయకులు. వీరిని జయిస్తే ఆసురీసేన అంతా చెల్లా చెదరైపోతుంది. ఈ మూడింటిలోను కామమే ప్రధానమైనది. కామం అంటే కోరిక. మనం దేనిని తలచుకుంటామో దానినే తెచ్చుకొని అనుభవించాలనిపిస్తుంది. ఈ కోరికనే ‘కామం’ అంటారు. కోరికలు తీరుతున్న కొద్దీ కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. అవి తీరే సమయానికి ఎవరైనా అడ్డుపడితే వారిపైక్రోధం కలుగుతుంది. ఇక కోరిన వాటిని సంపాదించుకుంటే వాటిని జాగ్రత్తగా దాచుకోవాలని, వాటిని వదలకుండా పట్టుక కూర్చొని, చూచుకొని ఆనందించాలనిపిస్తుంది.  ఇది లోభం. ఈ మూడూ ఆసురీ సంపదకు పెట్టని కోటలు.


(i) నరకస్య ద్వారం :- ఈ 3 నరకద్వారాలు అన్నారు. వీటిలో దేని ద్వారా ప్రయాణించినా చేరుకొనేది నరకాన్నే. ఇక ఈ మూడింటిని ఆశ్రయించి మూడింటి ద్వారా ప్రయాణిస్తే సరాసరి నరకానికే వెళతాడు. ఈ మూడూ ఆత్మనాశానానికి – అంటే తన నాశనానికి – సర్వనాశనానికి కారణమౌతాయి. ఆత్మనాశనమంటే అధోగతికి పోవటమే. నీచ నికృష్ట జన్మలెత్తుతూ భగవంతునికి దూరం కావటమే. ఈ మూడింటికి లోనైనవాడు మానవుడుగా జన్మించినా పశువులాగా జీవిస్తాడు. జన్మను వృధా చేసుకుంటాడు. దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రాపంచిక విషయాల కొరకు, భోగాల కొరకు అంగలారుస్తూ ఉంటాడు. కోరికలతో వేగిపోతుంటాడు. వాటిని తీర్చుకొనుటకు ఆరాటపడుతూ న్యాయమార్గంలో వీలుకాకపోతే అన్యాయ మార్గంలోనో, బలప్రయోగంతోనో – ఎలాగో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ కారణంగా అతడిలో దైవానికి చోటుండదు. ఇలా పశుజీవితాన్ని కొనసాగించి చివరకు కోరికలనే వాసనల మూటను నెత్తిన పెట్టుకొని హీనంగా – దీనంగా నీచ నికృష్ట జన్మల వైపు ప్రయాణం సాగిస్తాడు. మరేం చేయాలి? 

                                                                                                                           ఇంకావుంది 

–((***))–


వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రాజకీయ వార్త 

ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంది. నాలుగు రోజుల పాటు ఇజ్రాయెల్ దేశంలోని జెరుస‌లేంలో ఆయ‌న ప‌ర్య‌టించ‌బోతున్నారు.

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న బ‌య‌లుదేరి వెళ్లారు. హైద‌రాబాద్ నుంచి ముంబయి వెళ్లి, అక్క‌డి నుంచి నేరుగా బ‌య‌లుదేరారు. తిరిగి ఈ నెల 5న తాడేప‌ల్లి చేరుకుంటార‌ని ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది.

జ‌గ‌న్ తొలి ప‌ర్య‌ట‌న చుట్టూ ఇప్పుడు వివాదం అల‌ముకుంది. ఆయన ప‌ర్య‌ట‌న వ్య‌క్తిగ‌తం అని చెబుతూ దానికి ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేయడాన్ని విపక్ష నేతలు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏపీ ప్ర‌భుత్వ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ జులై 31న విడుద‌ల చేసిన జీవో ఆర్టీ నెంబ‌ర్ 1737 ప్ర‌కారం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న కోసం ఏపీ ప్ర‌భుత్వం 30,531 అమెరిక‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తోంది. దానికి గాను మ‌న క‌రెన్సీ ప్ర‌కారం రూ.22,52,500 విడుద‌ల చేసింది.

ఇజ్రాయెల్‌కు చెందిన ట్రిపుల్ ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు ఈ నిధులు చెల్లించారు. హైద‌రాబాద్ కి చెందిన ఎయిర్ ట్రావెల్ ఎంట‌ర్ ప్రైజెస్ ద్వారా వాటిని చెల్లిస్తున్న‌ట్టు అధికారిక ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్త‌ర్వుల‌ను ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. దానిపై కాల‌మిస్ట్ కుసంపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానిస్తూ “సీఎం తన కుటుంబంతో తన వ్యక్తిగత పనిపై జెరూసలేం వెళుతున్నారు. పైగా సొంత ఖ‌ర్చుతో ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తున్నార‌ని ప్ర‌చారం చేసుకున్నారు. అయినా ఈ ప‌ర్య‌ట‌న పేరుతో ఏపీ ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు చేయ‌డం విస్మ‌య‌క‌రం. నిజానికి ఆయ‌న కుటుంబం మొత్తం చేసే ఖ‌ర్చు క‌న్నా ప్ర‌భుత్వ వ్య‌య‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. రానుపోనూ టికెట్ ఛార్జీలు, ఇత‌ర ఖ‌ర్చులు చూసినా అంత పెద్ద మొత్తం ఖ‌ర్చు కాదు” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ నేప‌థ్యంలో నిధుల వినియోగంపై బీబీసీ తెలుగు ఏపీ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించింది. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్యదర్శి రామ్ ప్ర‌సాద్ సిసోడియా స్పందించారు.

జడ్ కేట‌గిరీలో ఉన్న వారి భ‌ద్ర‌త‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌డం సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ‌లో భాగ‌మేన‌ని ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఆర్పీ సిసోడియా వ్యాఖ్యానించారు.

“ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించే బాధ్య‌త ప్ర‌భుత్వానిది. సీఎం హోదాలో ఉన్న వారు వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లినా భ‌ద్ర‌త మాత్రం ప్ర‌భుత్వం తీసుకుంటుంది. జడ్ కేట‌గిరీలో ఉన్న వారంద‌రికీ అలాంటి ఏర్పాట్లు ఉంటాయి. సీఎం ప‌ర్య‌ట‌న‌కు ఇజ్రాయెల్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ ఏజ‌న్సీకి బాధ్య‌త అప్ప‌గించాం. ఏపీ ప్ర‌భుత్వంతో ఆ ట్రావెల్ ఏజ‌న్సీకి ఒప్పందం ఉంది. అందులో భాగంగానే జీవో విడుద‌ల చేసి నిధులు చెల్లించామ‌ని” ఆయ‌న వివ‌రించారు.