నీకోసం

కలలు కధలు కోసం
కధలు చెదలు కోసం
చెదలు రాతలు కోసం
రాతలు సుధలు కోసం

కళలు బతుకు కోసం
బతుకు మెతుకు కోసం
మెతుకు మమత కోసం
మమత బలము కోసం

కులాలు గుంపులు కోసం
మతాలు మంటలు కోసం
భెదాలు బందులు కోసం
తెడాలు తంపులు కోసం

వాదాలు కెంపులు కోసం
ద్వేషాలు కంపుల కోసం
కాలాలు మెప్పులు కోసం
దానాలు తప్పుల కోసం

స్వార్ధం లేని ప్రేమ కోసం
ద్వేషం లేని నీతి కోసం
ఆశే లేని ఆత్మ కోసం
బాధే లేని బంధం కోసం

సతి వేచే పతి కోసం
పతి వేచే సతి కోసం
సతిపతి కలిసే సంబరం కోసం
సంబరమే పిల్లల బతుకు కోసం