నేటి కవిత – ఎలా నిందిచగలం ?

మనం కప్పుకున్న దుప్పటినే తెల్లారేవరకూ
అధీనంలో వుంచుకో లేనివాళ్ళం.
మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కిందని
ఆకాశాన్నెలా నిందించగలం?!

మనకు వచ్చే కలలను నిరూపణ కొరకూ
నిర్ధారణ చేసుకో లేనివాళ్ళం
మెలుకవ వచ్చేసరికి కలలు నిజం కాలేదని
జీవితాన్ని ఎలా నిందిచగలం ?

మనం నేర్చిన కళలను బతికించుటకొఱకూ
సమర్ధత చూప లేనివాళ్ళం
మెలుకవ వచ్చేసరికి కళలకు తగ్గ విలువ ఇవ్వలేదని
ప్రభుత్వాన్ని ఎలా నిందించగలం ?

మనం అన్నమాటకు కట్టుబడి ఉండేంతవరకూ
నోరున్న వారితో పోట్లాడలేనివాళ్ళాం
మెలుకవ వచ్చేసరికి మాటకు తగ్గ విలువ ఇవ్వలేదని
స్వరాన్ని ఎలా నిందించగలం ?