నేటి పద్యం – స్త్రీ తత్త్వం -(మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ )

* .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే

    అంగాంగం సెగలే మనస్సు కలిసే సంతోష సమ్మోహమే

  ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే      

    స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే

తాత్పర్యము : ఆకర్షణ ఒక వరము, మనసును దోచి, సంసారం లో దించి, సుఖాలందించేది, శరీరంలో ప్రతి భాగపు సెగలను చల్లపరిచి, మనసుకు సంతోష పరిచి, సంమ్మోహపరిచేది, చూపుల్లొ సౌందర్యాన్ని చూపించి , మనసు అంతా ప్రేమను వ్యక్త పరిచేది, ఒకరి కొకరు కలుయు టకు  స్నెహపూర్వకమైన వాతారణం కల్పించి, తనువే సుఖంగా అర్పించి సంతోషం కల్పించి, సౌభాగ్యం అందించేది స్త్రీ మాత్రమే.    

*  గాఢాంద జ్వలయే, సరాగ వలపే, మాధుర్య వాత్సల్య మే

    భండారమ్ భగలే తేజస్సు  తొలిచే సాంగత్య సౌలభ్య మే

    బంధంతో కదిలే రేతస్సు కధలే కావ్యాల కారుణ్య మే

    నేడంతా శుభమే శుఘంధ సెగలే సౌఖ్యంబు తత్వాలులే      .

తాత్పర్యము : వాత్సల్యమనే తీపిదనము అందించి,  సరాగాలతో వలపులను చూపించి, చీకటిలో వేడి సెగలను చల్లార్చేది, పట్టుదలతో మొండిగా తపస్సు చేసిన భగ భగ సెగలు కమ్ముకొని సాంగత్యము ఒకరి కొకరు కలవాలని అనుకొనే భావము చూపునది, ఒకరి కొకరు భంధంతో పెన వేసుకొని మనసులో ఏర్పడే అనుకోని తేజస్సు ప్రశాంత కధలతో కావ్య రచనకు సహకరించేది, ప్రతిరోజూ సుఘంధ పుష్పాల పరిమళాలను అందించి, సుఖ సౌఖ్యం కల్పించేది, మనసుకు తత్వాలు భోదించేది స్త్రీ మాత్రమే.