శ్రీ కృష్ణ లీల- రచయత: మల్లాప్రగడ శ్శ్రీదేవి రామకృష్ణ

*ప్రకృతి పరవశించే వేళ, యువజంట తన్మయత్వంతో లీల !
పున్నమి వెన్నల వేళ, పరవసించి పరువాలు పంచుకొనే లీల !
మల్లెపూల పరిమళాల వేళ, కోరికలు సద్విని యొగంచేసుకొనే లీల !
సూర్యోదయం శుభవేళ, వ్యాయామమే ఆరోగ్యం మార్పులీల !
*అమృతఘడియలవేళ, దైవాణ్ని ప్రార్ధిస్తే మనసుకు ప్రశాంతి లీల !
పరుల దోషము నెంచు వేళ, ప్రకోపము బయట పెట్టు లీల!
పరులను హింసించు వేళ , నీచ గుణము లేకుండు లీల ! 
ప్రతి విషయంలో ప్రత్యేక వేళ, లంపటత్యం లేకుండు లీల !
*దురభిమానము, ద్రోహము, చేయువేళ,అనుమానము లేకుండు లీల !
ప్రతిఒక్కరిలొ అభిజనమదం వేళ, విద్యామదం,ధనమదం లేకుండు లీల ! 
యవ్వరికి ఆనాడు అర్థంకాని వేళ, ఉండు శ్రీకృష్ణ పరమాత్ముని లీల.
లీలను గురించి వర్ణించటం నాతరమా ఈ వేళ, నమో నమో శ్రీకృష్ణ లీల .

–((***))–