శ్రీ లలిత

393 – ప్రభావతీ

ఊహల్లో కదిలే అశాంతి నిలయం ఊహించె శ్రీమాత యే
సాహిత్య ఫలితం యసస్సుపెరిగే సామాన్య సౌఖ్యాలు ఇ
చ్చేహాయే గుణమే ప్రకాశ ఫలితం చిందేది అందర్కి సూ
ర్యోపాసం వెలుగే తమస్సు తరిమే రౌఱాగ్ని ప్రభావతీ

ఊహల్లో కూడ ఉండే అశాంతి, కోపాన్నితొలగించేది శ్రీమాత, సాహిత్యాన్ని పెంచి, సామాన్య సౌఖ్యాలు కల్పించి యశస్సును పెంచి ఫలితాన్ని అందించేది శ్రీమాతయే, సుఖం, గుణ ప్రకాశం, అందరికి కల్గించి, సూర్యుని ఉపాసన వల్ల వెలుగుతో మనలో ఉన్న చీకటిని తరిమి, శక్తిని పెంచేది మాతా ప్రభావతీ. .

–((***))–

394 ” ప్రభారూప ”

ఆకర్షించుటయే ఘనంబు పరిధీ ప్రేమల్లో సత్యాన్ని ఆ
ఏకత్వం, సకలం సమస్త వెలుగే ఏర్పర్చే భావాన్ని ఈ
సౌకార్యం సమాన శాంతి ఫలితం సౌశీల్య కల్పించుటే
శ్రీ మాతా గుణమే ప్రధాన వినయం శక్తి క్రియా పంచుటే

శ్రీ మాతా ఆరాధ్యుల్లో ఆకర్షణ పెంచి, విజయాన్ని కల్పించి, ప్రేమలో సత్యాన్ని నడిపించి, ఏకంగా, సకల అనరిలో వెలుగును పంచె భావాన్ని ప్రధానంగా శక్తిని పంచి, క్రియను తెల్పి, సౌశీల్యాన్ని, గుణాన్ని ప్రపంచానికి వినయంగా అందించేది శ్రీ మాతా “ప్రభారూపా ”

–((*))–

395 – “ప్రసిధ్ధా”

ప్రసిధ్ధా ప్రభవం ప్రభావ పయణం నేనేలె మాట్లాడటం
అహమ్మే పదమూ ప్రసిధ్ధి మదిలో మేల్కాంచు జాతీయతే
సంభోదించుటయే ప్రసిధ్ధ వరమే చైతన్య సద్భావమే
ఆశ్చర్యం జగమే ఎలేటి ఎరుకే శ్రీమాత ప్రసిధ్ధయే

ప్రతి ఒక్కరిలో నేనె అను మాటలో నడక ప్రభవం ప్రసిధ్ధం. మదిలో మెల్ కొల్పు జాతీయ అహమ్ము ప్రసిధ్ధి చెందటం. సంభోదించుటలో ప్రసిధ్ధి చెందే చైతన్య ఆశ్చర్య స్వభావమే. సర్వజగత్తులో ప్రసిధ్ధి చెందిన శ్రీమాతకు ప్రణతులు

__((**))__

396 – ” పరమేశ్వరి”

ఈశ్వరీ యజమానురాలు సకలం సృష్టించె శ్రీమాతయే

అర్ధంలో పరమార్ధ సంతసమునే తెల్పేటి శ్రీ మాతయే

ప్రేమమ్ తో పరమేశ్వరీ అనుభవం సృష్టికి మార్గమ్ముయే

ఈశ్వర్ పత్ని సత్య ముగా స్ధితికరీ ఆరాధ్య శ్రీమాతయే

పరమేశ్వరునకే ఈశ్వరిగ ఉండి సకలం సృష్టించే శ్రీ మాతగా, సంతోషాలను కల్పించి, అర్ధంలో పరమార్ధాన్ని తెలిపే శ్రీ మాతగా, సృష్టికి మార్గమ్ముగా పార్వతి పరమేశ్వరుల ప్రేమను అందించి,  సత్యముగా స్థితి కారిగా ఆరాధ్యులను ఆదు కుంటున్న శ్రీమాతకు ప్రణతులు

–((***))–

397 – “మూలప్రకృతి”

ఇచ్ఛా శక్తులతో మహత్తు తెలిపీ సాత్విక సావాసమే

వ్యక్తాలక్ష్యమునే వహించి సహనం తెల్పేటి ప్రేమత్వమే

అంకెల్లో నవమీ ప్రధాన భవమే భావాల సమ్మోహమే

అష్టప్రకృతులే స్వమాయ తెలిపే ఆసిస్సు శ్రీమాతయే

(అష్ట ప్రకృతులుః త్రిగుణాలు,పంచభూతాలు.)

జీవులకు సాత్విక గుణం కల్పించి మహత్తుతో ఇష్టమైనది అందించి శక్తిని పెంచేతల్లి. జీవుల లక్షణాలలో సహనం వహించమని తెలిపి ప్రేమను అందించేతల్లి. ప్రకృతి ని 9 వ అంకెతో పోలుస్తారు, దీనిని నవ అంటారు.నిత్యనూతనంగా ఏ వికారము కల్పించని భావాల సమ్మోహం పెంచే తల్లి. త్రిగుణాలు పంచభూతాలు అదుపులో ఉంచి జీవులకు ఆసిస్సు లందిచే మూలప్రకృతి యైన శ్రీ మాతకు ప్రణతలు.

–((***))–