సినిమా : ఫిదా (2017)

 

తారాగణం : వరుణ్ తేజ్, సాయి పల్లవి

దర్శకత్వం : శేఖర్ కమ్ముల
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ
గాయకులు: మధుప్రియ, రాంకీ

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే

క్రీము బిస్కెటు వేసిండే

గమ్ముగ కూర్సోనియడే

కుదురుగ నిల్సోనియడే

సన్న సన్నగ నవ్విండే

కునుకే గాయం జేసిండే

ముద్దే నొటికి పోకుండా

మస్తు డిస్ట్రబ్ జేసిండే

పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే

డిన్నర్ అన్నడే డేటు అన్నడే

ఏలు పట్టి పోలు తిరిగి

నిన్ను ఉల్టా సీదా చేసిండే

॥ వచ్చిండే॥

మగవాళ్లు మస్తు చాలు ॥3॥

మస్కలు కొడతా ఉంటారే

నువ్వు వెన్న పూస లెక్క

కరిగితే అంతే సంగతే

ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటే

మెయింటేను నువ్వు చేస్తే

లైఫ్ అంతా పడుంటాడే

॥ వచ్చిండే ॥

అయ్ బాబోయ్ ఎంత పొడుగో ॥3॥

ముద్దు లెట్టా ఇచ్చుడే

అయ్ బాయ్ ఎంత పొడుగో

ముద్దు లెట్టా ఇచ్చుడే

తన ముందు నిచ్చనేసి

ఎక్కితే కానీ అందడే

పరువాలే నడుము పట్టి

పైకెత్తి ముద్దే పెట్టే

టెక్నిక్సే నాకున్నాయిలే

పరేషానే నీకక్కర్లే

॥ వచ్చిండే ॥

పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే

డిన్నర్ అన్నడే డేటు అన్నడే

ఏలు పట్టి పోలు తిరిగి

నిన్ను ఉల్టా సీదా చేసిండే

అరే ఓ పిల్లా ఇంకా నువ్వు

నేలనిడిచి గాలి మోటర్‌లో

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే

క్రీము బిస్కెటు వేసిండే

గమ్ముగ కూర్సోనియడే

కుదురుగ నిల్సోనియడే

సన్న సన్నగ నవ్విండే

కునుకే గాయం జేసిండే

ముద్దే నొటికి పోకుండా

మస్తు డిస్ట్రబ్ జేసిండే

–((***))–