About Us

ఫిలిం స్టోరి

రైల్లో ఇద్దరు స్నేహితులు కలిసారు, ఒకరు ధనం, మరొకరు విద్య గొప్ప అంటుంటే అక్కడ ఉన్న వారిలో కొందరు హాస్యం సంభాషణలు తెలిపారు ?

హాస్య సంఘటనలు
Mallapragada Sridevi విద్య ఉన్నవాడికి తిండే దొరకదు, ధనం ఉన్నవానికి నిద్రేరాదు అన్నాడు ఒకయువకుడు, అవునూ అంటూ డూడూ బసవన్నలు తల ఊపారు “చదువుకున్న వాళ్ళకన్నా చాకలి మేలంటే ‘ ఎక్కిరించే.

నేటి పద్యం

ఓహో మాధవ రాధకృఫ్ణ జనబంధో ఆప్త బంధో విహా
రీ నీవే కరుణా మురారి శరణం ఈశ్వర రాధామనో
ప్రాణేశ్ ప్రేమసుధా ముకుంద భరితా పీతాంబరాధారి కాం
తాహృద్యా మధురా పురీశ మదనా పరమాత్మా మోహనా
–((***))–

Mallapragada Sridevi చదువు కొనుటకు డబ్బుకావాలి కదా
డబ్బుకు వెధవ వేషాలు వెయ్యాలి కదా
అని నవ్వుతున్నారు కుర్రకారు, పెద్దల సంపాదన ఖర్చు చేస్తూ విర్వవీగకండీ……మరింత చూడండి

ఇదిఒక సినమా సీను(3)
రైలు పట్టాల మధ్య చేతులు పట్టుకొని నడుస్తున్నారు. ఎదురుగా రైలు వస్తున్నది వారి మధ్య ఉన్న భావాల్ని ఊహించండి?
సినమా సీన్(4)
తాత ఆస్తి తండ్రి రెండింతలు పెంచాడు కొడుకు తప్పుచేస్తే తండ్రి జైలు కెల్లాడు ఆస్తిపోయింది ఎందుకో చెప్పగలరా?
  • సినమా సీను (5)
    రైల్లో నిద్రపోతున్న సమయంలో 16 సం. యువతి “గన్ ” చూపి హడావిడి చేసింది పట్టుకున్నారా, దోచుకొని పారిపోయ్యిందా ?

రామకృష్ణగారు మీ గురించి చెప్పలేదు
నేను ఎంచెప్పేది ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఎవరు బ్రతుకు వారిది ఎవరి పెళ్లిళ్లు వారే చేసుకున్నారు
వివరంగా చెపుతారా

కొడుకు : మేనరికమని తలచి పెళ్లి చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్న సమయాన ఓరొక అమ్మాయిని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక పాపకు తండ్రి అయ్యాడు, మాట మాట పెరిగి ఆ అమ్మాయితో వేరొకరితో లేచి పొయిన్ది ఎవ్వరికి చెప్పుకోలేక మ్యారేజ్ బ్యూరో నడుపుకుంటూ బతుకుతున్నాడు

కొడుకు: నటుడుగా మారి డబ్బు కోసం తనకన్నా పెద్ద వయసున్న, పిల్లలున్న మరో నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమెకు వేరే భర్త ఉన్నాడు వస్తు పోతుంతాడు, నటనతో జీవితం గడుపుతున్నాడు. పిల్లల పెళ్లి చేయలేక, భార్యలేక, నటన చెయ్యలేక నా ఇంట్లోనే ఉంటున్నాడు.

కూతురు : మంచి సంభంధం అని పెళ్లి చేసాను, ఉద్యోగరీత్యా వెళ్లి ఇంతకు రాలేదు, ఏమైనాడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు, ప్రవేట్ స్కూల్ నడుపుతూ బ్రతుకుతున్నది

కూతురు : వెధవరాలుగా ఇద్దరు పిల్లలతో నా ఇంటికి చేరింది, వాళ్ళ పోషణ చూడాలి నా పెన్షన్ డబ్బులతో అనారోగ్య భార్యతో జీవితం గడపాలి. నా అమానవరాళ్ల పెళ్లి చేయాలి ఇదే నా క్లుప్త కధ

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 

ప్రాంజలి  ప్రభ -ఇది కధ కాదు ఆనంద పారవశ్యం 

నాలో నేను అనుకుంటా నాది అనేది ఏదీలేదని, నా అనుకరణ ఎవరినైనా ఇబ్బంది పెట్టిన నేను క్షంతవ్యుణ్ణి, నా చదువు నాకు బెట్టిన బిక్షగా భావిస్తాను, నా శ్రీమతి నాకు రక్షగా, నన్ను నడిపించే నాయకగా,నయన మనోహర కలువల అపరంజి మణిగా, మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణిగా, కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యసశ్విణిగా, మనోధైర్యం, తేజస్సును వృద్ధిపరిచే తేజస్విణిగా ధర్మశాస్త్రములు తెలిపి, ఆదుకొనే అంతర్వాణిగా, కొన్ని విషయాలు తెలిసుకోనుటకు, సహాయపడే అన్వేషిణిగా, మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణిగా, అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణిగా, ఆస్తిని, అదాయమును పెంచి ఆహారమును అన్దిమ్చ్, అన్నప్రదాయిణిగా, పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణిగా, ఇంటిని, సభను, పిల్లలను, హుందాగా తీర్చి దిద్దన, అస్థాణిగా, కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణిగా, పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణిగా, రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణిగా మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణిగా, తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణిగా ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణిగా. భర్త దుర్వసనములు లోనైతే వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణిగా, ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణిగా, బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణిగా, అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణిగా , నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణి.

ఏమిటండి స్త్రీని అంత పొగుడుతున్నారనుకుంటున్నారా తప్పదండి లోకంలో బతకాలంటే స్త్రీ సహాయము అవసరం, అందుకే స్త్రీలను ఆదరించాలి “చెప్పుకింద తేలుగా నలిపితే లాభమేముంటుంది” స్త్రీ ని గౌరవించి, పొగిడితే కొంత లాభము అనుకోకండి ఆలా ఉండటం మొగవాని ఔదార్యానికి నిదర్శనం.

సృష్టికి మూలమ్ స్త్రీ, అక్షర సాత్యంగా చెపుతున్నా, స్త్రీని చూస్తే ప్రతి ఒక్కరిలో ఎదో పత్యేక బంధం ఉంటుందని భావన వెంట పడుతుంది. సముద్రాన్ని చిలికి అమృతాన్ని తేవచ్చుకాని స్త్రీల మనసును అర్ధం చేసుకోవటం చాలా కష్టం. గోరంత ప్రేమతో గుండెను తాక కలదు, మీటగలదు, కలపగలదు. పూల కోమలత్వం ఆమెలోని ఉన్నది. శశి శీతలత్వంతో ఉష్ణాన్ని ఒక ఆట పట్టిస్తుంది. ఉష్ణతత్వం పొంది శీతలత్వాన్ని ఉడికించి ఉష్ణం గామార్చి ఏకమై కొత్తలోకాలు చూపే శక్తి ఒక్క స్త్రీ కే ఉంది. స్వేచ్ఛా గీతాలు పాడుకుంటూ, కలలు కంటూ, సాకారానికి కలకాలం కాలంతో పోరాడుతుంది. రెక్కలు కొట్టుకొని కుటుంబానికి నిద్రను వదలి సహకరిస్తుంది.
ఆకలి కడుపుతో ఆకలిని తీరుస్తుంది. చిరిగిపోయ్యేవి పెదవిచాటు నవ్వులని తెలిసి, తలవంచి తనపని చేసుకొని పోతూ ఉంటుంది. ప్రేమను పంచి ప్రేమించటం తప్ప వేరే విషయం తెలియదు ఆమెకు. చీకటిలో కూడా వెలుగును చూపి అహర్నిసాలు తపించి ఉండేది ఆమె. సిరిని పెంచి జ్యోతిగా వెలిగి చీకటిని తరిమేది, ఆమె ఏమి చదవకపోయినా స్త్రీగా సీలు అందించటం అక్షర సత్యం.

భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం…! చదవండి

1 . నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

2 . తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ… తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

3 . అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.

4 . ప్రతి భర్త తన భార్యను… మరో తల్లి రూపంగా భావిస్తే.. ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది… ఇదే మధురమైన బంధం… ఇప్పటికీ… ఎప్పటికీ…

5 . భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం

బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

6 . సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

7 . ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ అర్థం చేసుకునే భర్త

ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని… మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

8 . భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.

9 . ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ… గొప్ప విద్యా వంతురాలి కిందే లెక్క…!

10 . అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

11 . మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది ‘మాంగల్య బంధం’.

12 . బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

13 . మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

14 . కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా… సమాజంలో భర్త పరువు నిల బెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

15 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

16 . ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని ‘వివాహం’ అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

17 . సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం – కుటుంబం.

18 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా… ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

19 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.

20 . వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.

21 . నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!

22 . సప్తపది ఏడు అడుగులు మొదటి అడుగు – అన్న వృద్ధికి రెండవ అడుగు – బలవృద్ధికి మూడవ అడుగు – ధన వృద్ధికి నాల్గవ అడుగు – సుఖవృద్ధికి

ఐదవ అడుగు – ప్రజాపాలనకి ఆరవ అడుగు – దాంపత్య జీవితానికి

ఏడవ అడుగు – సంతాన సమృద్ధికి

23 . కోరుకున్న ఇంతి… నేడు నీ సతి… నేడు పట్టుకున్న ఆమె చేయి…

విడవకు ఎన్నటికీ.

24 . వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు. పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.

కలిమి లేములతో…కలసిన మనసులతో… కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో… బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.

పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ… మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మగవాడు గాలి పటం

(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు) ఆడది దారం, అతడికి ఆధారం

(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)

విడివిడిగా దేనికీ విలువ లేదు, ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.

భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు, భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు, భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే. పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.

*నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం?*

స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరోక ప్రాణికి జన్మనిస్తుంది.
అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పధార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు

*వాటిల్లోనల్లపూసలు ఒకటి*

ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి.

సకలదేవతల సన్నిధానయుల్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, *సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం మతైదువకు ముఖ్యమైనది.*

*వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు.*

ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం.

ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది.

*ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి.*

*ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిదికాదు.*

స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా … పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది.

ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, *పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు.*

వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ‘నలుపు రంగు’ ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.

*అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు.*

వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు.

ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే ‘నీలలోహిత గౌరి’ కి పూజలు చేయిస్తారు.

ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

*నాకు వివాహమును ,భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే……….. బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.నీలలోహిత గౌరిని పూజించడం వలన … ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది.*

*అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.*

చిగురించిన జీవితం ఎలా ఉంటుందో ఒక్క సారి ఇది చదవండి మీ ఆలోచనలకు పదును పెట్టి సంసారాన్ని సుఖ మయం చేసుకోండి

జీవితం లో లెక్కలేని ఆటు పోట్లను ఎదుర్కొని ప్రతి ఒక్కరు జీవితం గడపాలి.  ఏ మనిషికైనా జీవిత ఆఖరి చరణం లో అసహాయత, అహంకారం రెండిటిని వదిలేసి.. చెలికాడా నీవు తప్ప అన్యధా శరణం నాస్తి అని నిన్నే వేడుకోవలసి వస్తుందేమో…. 

అది అసహాయత అనవచ్చేమో, కాని అసహాయత ప్రతిఫలం ఆశించి, అది  సాధించలేని అశక్తత తో కలిగేది…. ఇప్పటి ఈ క్షణాన, ఇక భౌతిక కోరికలేవి నా దరి దాపులకైనా రాని ఈ ఘడియ లో నే నిను వేడేది, “

నా పుట్టుకనే నీది చేసుకున్ననా ప్రాణ సఖా…. ఈ నిరంతర యాత్ర లోని వేదనను, ఆనందాలను ఇంకొక్కసారి మననం చేసుకుని, సమీక్షించు  కోవాలని వుంది” అనే. నా అంతరంగాల ఆంతర్యాలు నీకు తెలియవని కాదు…… ఆ అంతరాగాన్ని…. ఆంతర్యం లోని కోరికను సృష్టించింది 

నీవైనప్పుడు, దానినే నీకు తిరిగి మనవి చేయటం ఈ అంత్య క్షణాలలో నాకు కలిగిన సంధి ప్రేలాపనే కావొచ్చు, ఐనా ఈ రోజు ఇలా మొండి తెగువ తో నీ ముందు నీకు తెలిసిన దానినే నీకు తేట తెల్లం చేయాలనే ఈ కోరిక కలిగింది 

నీ పాదాల చెంత సుగంధభరిత పూరేక గా చెయ్యక, నా మనసును బిగ్గర గా ఈ రోజు నీకు నివేదన చేసేంత వ్యవధినివ్వు……. మరి నన్ను ఏకారణానికి వుద్దేశించి సృజించావో ఇప్పటికైనా…… నీకైనా అర్ధం అయ్యిందా……..?

ప్రపంచానికే ప్రేమను పంచి ఇవ్వగలప్రేమ మూర్తి వే… నీ ప్రేమ కోసం నన్ను జీవితమంతా వేచి వుండేటట్లు చేయటం న్యాయమా…. స్త్రీ మనసు కుసుమ కోమలమైనది… అది నిరంతరం ప్రేమాన్వేషి… కాని ప్రేమ ఒక్క స్త్రీ పరమేనా… దానిని సృజించి పంచి ఇవ్వగలపురుషుడి సొంతం కూడా ఐనప్పుడు, అతను మాత్రం ప్రేమాన్వేషి కాదా… 

జగాన ప్రతి క్షణాన బిడ్డగా, సోదరుడి గా, స్నేహితుడి గా, భర్త గా, తండ్రి గా రకరకాల పాత్ర లలో అతను మాత్రం ప్రేమాన్వేషి గా మారడా.. మరి మాకే ఎందుకు ఆ పేరు? అది కూడానీ విలాస వివరాలలోని ఒక భాగమా… ఈ అసమానత్వపు వెతుకులాటల సమీకరణ లో నేనెప్పుడూ శేషం గానేమారేనెందుకు…….?? 

చిన్నతనానే నేనెవరో నాకు తెలియకుండానే…. నా పైన కమ్ముకున్న నీలి మేఘమై… నా హృదయాన వర్షించిన వంశీనాదమై…..నన్నావరించుకున్న నీలాకాశ శూన్యమై జీవితాన 

ఒంటరి పధాన్ని ప్రేమతో కలబోసి సూచించావు. 

నేనే అర్ధం చేసు కోలేని దాననై, అనేక రూపాల ప్రేమ ప్రలోభాలకు లోనై, నేను నిర్మించుకున్న దారుల వెంట పరుగెత్తేను. అలాపరుగెత్తటం కూడానీ మాయలోని భాగమా …… పరుగెత్తి తగిలించుకున్న దెబ్బలను చూసుకుని ఈక్షణాన నవ్వుకోగల విజ్ఞత నీ దయేనా……! 

సమస్తం నీ పాదాల దగ్గర అర్పణ చేసి, కర్మ నాది కాదు, కర్మఫలం నాదికాదు అని వదిలెయ్యగల ధీమా, కొడిగొట్టిపోయే ముందు వెలుగు జిలుగులా? బాల్యాన నా ఆట పాటలలో ఒక బొమ్మవై, నాతో నిరంతరం సంచరించే బాల్య స్నేహితుడి గా నీ రూపు 

చిరపరిచిత మే నాకు…. తాయిలాల దాచిన మధుర తీపిదనం… 

ఆటలలోనిఅమాయకత్వం…. నిదుర కళ్ళలో సుఖం…. వానపొద్దు నీటిబుడగల పై తేలిన నవ్వురవ్వల వరాల వెన్నెల లో నాతోసదా సంచరించిన మువ్వల రవళులు నీవే కదా.. 

యవ్వనాన కోటి ఆశల మైమరుపుల కళ్ళ మీదకుశీతాకోకచిలుక లా వాలిన జిలుగుకలల రూపానివై, ….  నేను నీకు అర్పణ చేసుకుని నేను నువ్వులో ఒకభాగమనుకున్నప్పుడు, చిలిపినవ్వుల మానసచోరుడివై నాతో కలసి పక పక లాడినది నువ్వుకాదూ……?

నీ రూపును…. మదిన, జీవితంలో నిలుపుకుని నీ తోటి సరాగాలను కోటి కలలు గా కనులలో దివ్వెలుగా నింపుకుని, నీముంగిట పూచిన పువ్వై మారాలనుకున్నప్పుడు నువ్వేనా………. ఆనతిచ్చి, నా జీవితసహచరుడిగా మారి నా కలలోకి, కౌగిలిలోకి వచ్చావు……. .!!! 

వృద్ధాప్యాన వొణికిన కాళ్ళ వూతమై, మానసిక చాంచల్యం రాకుండా వెన్నంటి కాపాడిన నేస్తానివై నదయామయుడివి నీవు కాదు…. ఐనా కూడా… ఇన్ని రూపాలలో నువ్వు నాతో వున్నా ఎందుకీ అసంతృప్తి…..? ఏక్షణానా……. నువ్వే అది నువ్వే అని నేనెందుకు 

ప్రామాణికంగా గుర్తించలేక పోయాను? నీ నీలి క్రీనీడలో కనీసమ్ నలిగి పొవాలనిఆశతొ కోటి కలలు కంటూ జీవిస్తాను. మా గురువుగారు పంపిపన ఈ చమత్కారము చదివి ఆనందించండి – ఆనంద పారవశ్యం లో మునిగి తేలండి 

 

 

* .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే

    అంగాంగం సెగలే మనస్సు కలిసే సంతోష సమ్మోహమే

  ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే      

    స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే

తాత్పర్యము : ఆకర్షణ ఒక వరము, మనసును దోచి, సంసారం లో దించి, సుఖాలందించేది, శరీరంలో ప్రతి భాగపు సెగలను చల్లపరిచి, మనసుకు సంతోష పరిచి, సంమ్మోహపరిచేది, చూపుల్లొ సౌందర్యాన్ని చూపించి , మనసు అంతా ప్రేమను వ్యక్త పరిచేది, ఒకరి కొకరు కలుయు టకు  స్నెహపూర్వకమైన వాతారణం కల్పించి, తనువే సుఖంగా అర్పించి సంతోషం కల్పించి, సౌభాగ్యం అందించేది స్త్రీ మాత్రమే.    

*  గాఢాంద జ్వలయే, సరాగ వలపే, మాధుర్య వాత్సల్య మే

    భండారమ్ భగలే తేజస్సు  తొలిచే సాంగత్య సౌలభ్య మే

    బంధంతో కదిలే రేతస్సు కధలే కావ్యాల కారుణ్య మే

    నేడంతా శుభమే శుఘంధ సెగలే సౌఖ్యంబు తత్వాలులే      .

తాత్పర్యము : వాత్సల్యమనే తీపిదనము అందించి,  సరాగాలతో వలపులను చూపించి, చీకటిలో వేడి సెగలను చల్లార్చేది, పట్టుదలతో మొండిగా తపస్సు చేసిన భగ భగ సెగలు కమ్ముకొని సాంగత్యము ఒకరి కొకరు కలవాలని అనుకొనే భావము చూపునది, ఒకరి కొకరు భంధంతో పెన వేసుకొని మనసులో ఏర్పడే అనుకోని తేజస్సు ప్రశాంత కధలతో కావ్య రచనకు సహకరించేది, ప్రతిరోజూ సుఘంధ పుష్పాల పరిమళాలను అందించి, సుఖ సౌఖ్యం కల్పించేది, మనసుకు తత్వాలు భోదించేది స్త్రీ మాత్రమే.