నేటికవిత – సమాజం

నేరాలు, ఘోరాలు చూడలేక
సిగ్గుతో కళ్ళుమూసుకున్నది ధర్మదేవత
దారుణ, మారణకాండను మార్చలేక
తలదించుకున్నాది రక్షక న్యాయ దేవత

ప్రేమలను, భందాలను కల్పలేక
సత్యాన్ని తెల్పలేకున్నది సత్య దేవత
వంచనలు, వాంఛలను తొలగించలేక
పశుత్వాన్ని మార్చలేని సామజ దేవత

స్త్రీ, పురుషుల ఉద్యోగాల్ని అదుపుచేయలేక
బిడ్డల సంరక్షణ చూపలేని ప్రకృతిమాత
ధనాశ పెర్గి సంసారసుఖం అందించలేక
మనస్సును మర్థనచేయు ఆరోగ్య దేవత